ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (18:23 IST)

నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. స్వీటీ అనుష్క (video)

క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై టాలీవుడ్ అగ్రనటి, స్వీటీ అనుష్క స్పందించింది. తాజాగా సినీ ఇండస్ట్రీలో తాను కూడా అలాంటి వేధింపులు ఎదుర్కొన్నానని అనుష్క షాకిచ్చింది. అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని తెలిపింది. తాను కూడా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్ వల్ల వేధింపుల బారిన పడ్డానని పేర్కొంది. 
 
సినీ రంగంలో ఇలాంటి వేధింపులు ఎదురవుతాయన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్‌ ఉందని కెరీర్ ప్రారంభంలో తానుకూడా ఇలాంటి నాన్‌సెన్స్ ఎదుర్కున్నానని చెప్పింది. నిజాయితీగా వుండటం.. ధైర్యంగా వ్యవహరించడం వల్లే క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగానని తెలిపింది. ఆ తర్వాత ఇంతవరకు తనతో ఎవ్వరూ అలా ప్రవర్తించలేదని అనుష్క తెలిపింది.
 
ఇకపోతే.. బాహుబలి తర్వాత భాగమతిని పూర్తి చేసింది దేవసేన. ఆ తర్వాత ఒక్క నిశ్శబ్ధం మాత్రమే ఒప్పుకుంది. గతేడాది చిరంజీవి నటించిన సైరాలో ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో మెరిసింది. తన ఇమేజ్‌కు తగ్గ పాత్రలు వచ్చినపుడు చూద్దాంలే.. ఇప్పటికైతే ఇక చాలు అని అనుష్క భావిస్తున్నట్లు తెలుస్తుంది.
 
అందుకే ఈ మధ్య జేజమ్మ నుంచి అస్సలు అనౌన్స్‌మెంట్స్ కూడా రావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అనుష్క అసలు భవిష్యత్తులో అయినా సినిమాలు చేస్తుందా లేదా అనేది మాత్రం అనుమానంగానే మారింది.