మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (18:03 IST)

'అర్జున్ రెడ్డి' ఓవర్సీస్ రికార్డులు బద్ధలు...

అర్జున్ రెడ్డి దెబ్బకు ఓవర్సీస్ రికార్డులు బద్ధలవుతున్నాయి. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈనెల 25వ తేదీన విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుక

అర్జున్ రెడ్డి దెబ్బకు ఓవర్సీస్ రికార్డులు బద్ధలవుతున్నాయి. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈనెల 25వ తేదీన విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. తన రెండో సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోతో పాటు, మొదటి రోజు కలెక్షన్లను కలిపి 4 లక్షల 60 వేల డాలర్లును 'అర్జున్ రెడ్డి' రాబట్టింది. 
 
ముఖ్యంగా, అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' సినిమా ఇవే షోలకుగాను 3 లక్షల 96 వేల డాలర్లను వసూలు చేసింది. నాని తాజా హిట్ మూవీ ‘నిన్ను కోరి’కి 3 లక్షల 82 వేల డాలర్లు వచ్చాయి. అయితే రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమా మాత్రం 'అర్జున్ రెడ్డి' కంటే 9 వేల డాలర్లను ఎక్కువ కలెక్ట్ చేసింది. చరణ్ మూవీకి 4లక్షల 69వేల డాలర్ల కలెక్షన్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ రికార్డు కూడా బద్ధలయ్యే అవకాశం ఉంది. కానీ, 'బాహుబలి' చిత్రం రికార్డు మాత్రం పదిలంగా ఉండనుంది.