ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (17:10 IST)

అనుష్క, మృణాల్ ఠాకూర్, ఐశ్వర్యారాయ్‌లతో చిరంజీవి రొమాన్స్

AishwaryaRai
మెగాస్టార్ చిరంజీవి 156 సినిమాలో ఐశ్వర్య రాయ్ పేరు తెరపైకి వచ్చింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న మెగాస్టార్ 156వ సినిమా సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ  సినిమాకి, సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇది సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ. ఇందులో ముగ్గురు హీరోయిన్లకు ఛాన్స్ వుంది. 
 
ఒక కథానాయికగా అనుష్క పేరు .. మరో కథానాయికగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. తాజాగా ఐశ్వర్య రాయ్ పేరు తెరపైకి వచ్చింది. ఐశ్వర్యారాయ్‌ని మూడు హీరోయిన్లలో ఒకరిగా నటింపజేసేందుకు సంప్రదింపులు జరిపారు. ఇందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
తెలుగులో ఐశ్వర్య రాయ్ తన కెరియర్ తొలినాళ్లలో 'రావోయి చందమామ' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తరువాత ఆమె నేరుగా తెలుగు సినిమా చేసింది లేదు. చాలాకాలం తర్వాత ప్రస్తుతం తెలుగు సినిమాకు ఒప్పుకోవడం ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.