సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (18:50 IST)

చిన్న‌జీయ‌ర్ స్వామి శిష్యుల వేద మంత్రాల‌తో ఇంటిలోకి ప్రవేశించిన రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న, క్లీంకార

charan, upasana enters chiru house
charan, upasana enters chiru house
గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ అయ్య‌ప్ప‌మాల వేసుకుని క‌నిపిస్తున్నారు. మ‌రో వైపు ఉపాసన సంప్ర‌దాయంగా చీర‌క‌ట్టుతో ఉన్నారు. వీరిద్ద‌రికీ ఈ ఏడాది మ‌ర‌పురానిదిగా మారింద‌నే చెప్పాలి. ఎందుకంటే వారి జీవితాల్లోకి క్లీంకార అడుగు పెట్టింది. మూడు నెల‌ల‌లు అమ్మ‌మ్మ ఇంట్లో ఉన్న ఈ మెగా ప్రిన్సెస్ ఇప్పుడు కొణిదెల వారింటిలోకి అడుగు పెట్టింది. 
 
ఈ ఏడాది కొణిదెల ఫ్యామిలీ గ‌ణేష్ చతుర్థి వేడుక‌ల‌ను ఎంతో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంది. ఈ ఫొటోల‌ను రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు  సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో గ్లింప్స్ అంద‌రిలోనూ సంతోషాల‌ను నింపింది. క్లీంకారతో జ‌రుపుకున్న ఈ గ‌ణేష్ వేడుక‌లు.. వాటికి సంబంధించిన ఫొటోలు అంద‌రి మ‌న‌సుల‌ను హత్తుకుంటున్నాయి. నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ  ఫొటోలు అంద‌రిలో పండుగ ఉత్సాహాన్ని నింపుతున్నాయి. 
 
Disciples of Chinnajiyar Swami
Disciples of Chinnajiyar Swami
ఉపాస‌న త‌ల్లిదండ్రులు శోభ‌న‌, అనీల్ కామినేనిల‌తో మూడు నెల‌ల పాటు అమ్మ‌మ్మ ఇంట్లోని ఉన్న క్లీంకార ఇప్పుడు కొణిదెల‌వ వారింట అడుగు పెట్టింది. త‌మ ఇంట్లోకి తొలిసారి అడుగు పెట్టిన చిన్నారికి రామ్‌చ‌ర‌ణ్‌, గ్రాండ్ పేరెంట్స్ చిరంజీవి కొణిదెల‌, సురేఖ అద్భుతంగా స్వాగతం ప‌లికారు. చిన్న‌జీయ‌ర్ స్వామి వారి ఆశ్ర‌మంలో వేదాల‌ను అధ్య‌యనం చేస్తోన్న పండితులు ఆ గ‌ణానాథుని వేద మంత్రాల‌తో స్తుతిస్తుండ‌గా క్లీంకార ఇంట్లోకి అడుగు పెట్ట‌టం వారంద‌రికీ ఎంతో ప్ర‌త్యేకంగా నిలిచింది. 
 
 ఓ వైపు గ‌ణేష్ చతుర్థి, మ‌రో వైపు క్లీంకార ఇంట్లోకి అడుగు పెట్ట‌టం అనేది కుటుంబ స‌భ్యుల‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వారెంత ఆనందంగా ఉన్నార‌నే విష‌యం ఫొటోల్లో స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌ట్టి వినాయ‌కుడిని ఇంట్లో ప్ర‌తిష్టించి దానికి సంబంధించిన స్టేజ్‌ను ఎంతో అందంగా అలంకరించారు. ఈ పండుగ‌ను ఎంత అంకిత భావంతో నిర్వ‌హించారనే విష‌యం గ‌ణేష్ వేడుక‌ల‌కు చేసిన అలంక‌ర‌ణ చూస్తే అర్థ‌మవుతుంది. 
 
రామ్ చ‌ర‌ణ్ ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపించారు. సాధార‌ణంగా ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో చ‌ర‌ణ్ అయ్య‌ప్ప మాల వేసుకుని క‌నిపిస్తుంటారు. RRR రిలీజ్ ముందు ఆస్కార్ నామినేష‌న్స్ ముందుగానూ ఆయ‌న అయ్య‌ప్ప‌మాల‌ను ధ‌రించి  క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఆయ‌న మాల‌తో క‌నిపించ‌టం అనేది అంద‌రినీ హ‌త్తుకుంది. ఈ ఏడాది తండ్రిగా మారిన ఆయ‌న‌కు ఇదెంతో ప్ర‌త్యేకమైన‌ద‌నే చెప్పాలి. క్లీంకార పుట్టిన త‌ర్వాత కొణిదెల ఫ్యామిలీ జ‌రుపుకుంటున్న‌తొలి వినాయ‌క చ‌తుర్థి వేడుక‌లు ఇవే. చ‌ర‌ణ్ ప‌క్క‌నే క్లీంకార ప‌ట్టుకుని ఉపాస‌న కూర్చున్న ఫొటో ఎంతో ప్ర‌త్యేక‌త‌ను క‌న‌ప‌రుస్తుంది. 
 
అలాగే ఈ ఫొటోల‌ను త‌మ సోష‌ల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న ‘‘అంద‌రికీ హ్యాపీ వినాయ‌క చ‌వితి. ప్ర‌తి ఒక్కరి జీవితాల్లో విఘ్నేశ్వ‌రుడి ఆశీర్వాదాల‌తో స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోవాల‌ని, శుభాలు ఎదురు కావాల‌ని కోరుకుంటున్నాం. ఇదెంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే క్లీంకార‌తో క‌లిసి తొలి గ‌ణేష్ చ‌తుర్థి వేడుక‌ల‌ను జ‌రుపుకున్నాం’’ అన్నారు. 
 
రామ్ చరణ్ అందరితో కలిసి గణేష్ వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవటం గమనిస్తే సంప్రదాయాలను ఆయనెలా గౌరవిస్తారనేది అర్థమవుతుంది. అలాగే ముఖ్యమైన సందర్భాల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి మరపురాని క్ష‌ణాల‌ను ఉండేలా చూసుకుంటార‌నే సంగ‌తి తెలుస్తుంది.