శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (20:09 IST)

మ‌ళ్ళీ సోలోగా రాబోతున్న సాయిధ‌ర‌మ్‌తేజ్‌?

Sayidharam Tej
క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత మొద‌ట‌గా విడుద‌లైన సినిమా సాయిధ‌ర‌మ్ తేజ న‌టించిన సోలో బ్రతుకే సో బెటర్’. ఆ సినిమాకు వ‌చ్చిన ఆద‌ర‌ణ వ‌ల్ల ఇక థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌స్తార‌ని సినిమా రంగం ధైర్యంతో ముందుకు అడుగువేసింది. ఇప్పుడు సెకండ్ వేవ్ లాక్‌డౌన్ కూడా ఎత్తి వేయ‌డంతో వ‌చ్చే నెల‌లో థియేట‌ర్లు ఓపెన్ చేయాల‌ని సినిపెద్ద‌లు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ముంద‌గుడు వేసి ఈసారి కూడా సాయిధ‌ర‌మ్‌తేజ్ అనే వార్త ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. 
 
సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన సినిమా `రిప‌బ్లిక్‌`. క‌రోనా సెకండ్‌వేవ్ వ‌ల్ల ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌నే వార్త వ‌చ్చింది. కానీ సినిమా యూనిట్ ఖండించింది. ఎట్టిప‌రిస్థితుల్లోనూ థియేట‌ర్‌కు వ‌స్తుంద‌ని తేల్చిచెప్పింది. ఇప్పుడు ఆ దిశ‌గా చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. సాయి ఇప్ప‌టికే డ‌బ్బింగ్ ప్రారంభించారు. ప్ర‌భుత్వం రూల్ ప్ర‌కారం ఈసారి కూడా ఆక్యుపెన్సీ యాభై శాతం ఉంటుందా లేక నూరు శాతం ఉంటుందా అనేది తెలియదు. కానీ ఒకసారి థియేటర్లు అంటూ తెరిస్తే మొదటగా జనం ముందుకు వచ్చేందుకు సాయిధరమ్ తేజ్ సిద్ధం కాబోతున్నాడట. అతను హీరోగా, దేవ కట్టా ‘రిపబ్లిక్’ మూవీని విడుదల చేసేందుకు నిర్మాతలు భగవాన్, పుల్లారావు సన్నాహాలు ప్రారంభించారు. ఇదే నిజ‌మైతే సాయిధ‌ర‌మ్‌కు క‌రోనా సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి.