మంగళవారం, 20 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2016 (17:03 IST)

దర్శకులకు విసుగు పుట్టిస్తున్న మహేష్... ప్రిన్స్‌ను తిట్టిపోస్తున్న డైరక్టర్లు

'బ్రహ్మోత్సవం' పరాజయంతో మహేష్‌బాబు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడట. భారీ బడ్జెత్‌తో తీసిన సినిమాలు కూడా అతి పెద్ద పరాజయం కావడంతో మహేష్‌ తన కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు టాలీవు

'బ్రహ్మోత్సవం' పరాజయంతో మహేష్‌బాబు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడట. భారీ బడ్జెత్‌తో తీసిన సినిమాలు కూడా అతి పెద్ద పరాజయం కావడంతో మహేష్‌ తన కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు టాలీవుడ్ టాక్. కథ వింటున్నప్పుడు ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ మహేష్‌ ఊ కొట్టడం లేదట. అలా అని ఖచ్చితంగా నో అని కూడా చెప్పడం లేదట. 
 
గతంలో తనకి కథా పరంగా అనుమానాలు ఉన్నా కానీ ఆయా దర్శకులతో ఉన్న సత్సంబంధాల వల్ల, వాళ్ల టాలెంట్‌ మీద వున్న నమ్మకంతోను వెంటనే సరే అనేసేవాడు. అయితే ఈ ధోరణి వల్ల కొన్ని ఊహించిన పరాజయాలే ఎదురయ్యేసరికి ఇకపై అలాంటి వాటికి దూరంగా వుండాలని ప్రిన్స్ గట్టిగా ఓ నిర్ణయానికి వచ్చాడట.
 
ఇదిలావుంటే.. పూరి జగన్నాథ్‌, త్రివిక్రమ్‌తో పాటు మరో ఇద్దరు దర్శకులు కూడా మహేష్‌కి ఈ మధ్య కథ వినిపించారు. ఈ నేపథ్యంలో కథ విన్న మహేష్‌ వాళ్లకి అవునని, కాదని చెప్పలేదట. కథ వినేసి ఎప్పటిలా ఒక చిరునవ్వు చిందించాడట. అది అంగీకారమో, అభ్యంతరమో అర్థం కాని ఆ దర్శకులు ఆ కథలను మహేష్ కోసం అట్టి పెట్టాలా లేదా వేరే హీరోలకి వినిపించాలా అనే డైలమాలో ఉన్నారట. నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేస్తే సరిపోతుంది కదా... ఇలా నాన్చుతూ, నవ్వుతూ అనుమానంలో పడేయవద్దని ఆ దర్శకులు పబ్లిగ్గానే వాపోతున్నారట. ప్రస్తుతం మహేష్-మురుగదాస్ సినిమాతో బిజిబిజీగా ఉన్నాడు.