తాప్సీకి ఆ డైరెక్టర్ చాలా క్లోజ్? అందుకే డబ్బంతా ఆమె పేరు మీద? (Video)

Tapsee
జె| Last Updated: బుధవారం, 3 మార్చి 2021 (20:41 IST)
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ ఇళ్ళపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ముంబైలో ఈ సోదాలను నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. నిర్మాణ సంస్ధ ఫాంటోమ్ ఫిల్మ్స్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

ముఖ్యంగా ఫాంటోమ్ ఫిల్మ్స్‌తో సంబంధం ఉన్న డైరెక్టర్లు, నటుల ఇళ్ళలోను సోదాలు కొనసాగుతున్నాయట. పుణేలోను సోదాలు కొనసాగుతున్నాయి. ఉడతా పంజాబ్, క్వీన్, సూపర్ 30 లాంటి సినిమాలు ఫాంటోమ్ ఫిల్మ్స్ నుంచే వచ్చాయి.

అయితే మూడురోజుల క్రితం ఫాంటోమ్ ఫిల్మ్స్ సంస్ధపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి కోట్ల రూపాయలు పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. అయితే ఈ సంస్ధను అనురాగ్ కశ్యప్ స్థాపించారట. ఇందులో వచ్చే ఆదాయం మొత్తాన్ని తాప్సీ పేరు మీద కూడా బదలాయించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కానీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో కంపెనీతో సంబంధం ఉన్న హీరోహీరోయిన్లకు చెందిన కార్యాలయాలు, ఇళ్ళపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.


దీనిపై మరింత చదవండి :