శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 1 మే 2018 (14:03 IST)

చరణ్‌ సినిమాలో నాని విలన్‌..!

రంగస్థలం సినిమాతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప‍్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. రంగస్థలం రిలీజ్‌ తరువాత షార్ట్‌ గ్యాప్‌ తీసుకున్న చరణ్, ఇటీవలే బోయపాటి టీంతో జాయిన్‌ అయ్యారు.

ఈ సినిమాలో చరణ్‌ సరసన భరత్‌ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాలో చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్రలు నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆ న్యూస్ ఏంటంటే... ఈగ సినిమాలో విల‌న్‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న సుదీప్ సినిమాలో న‌టిస్తున్నాడ‌ట‌. అయితే... విల‌న్‌గా న‌టిస్తున్నాడా..? లేక కీల‌క పాత్ర పోషిస్తున్నాడా అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.