బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Modified: సోమవారం, 28 జనవరి 2019 (15:37 IST)

3 రోజుల్లో ఎన్టీఆర్ కథానాయకుడుని బీట్ చేసిన మణికర్నిక... కుళ్లుకుంటున్న క్రిష్

కంగనా రనౌత్ నటించిన మణికర్నికకు దర్శకత్వం వహిస్తూ మధ్యలోనే ఎన్టీఆర్ బయోపిక్ చేసేందుకు క్రిష్ వచ్చేశాడు. ఐతే ఆ తర్వాత మణికర్నిక స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయడం వల్ల తను వైదొలగినట్లు వార్తలు వచ్చాయి. ఏదైతేనేం... క్రిష్ వైదొలిగినా కంగనా రనౌత్ పట్టు వదలకుండా ఆమే ఆ చిత్రానికి స్వీయ దర్శకత్వం చేసి చిత్రాన్ని విడుదల చేసింది.
 
ఐతే అసలు విషయం ఏంటంటే... ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం మణికర్నిక ముందు తేలిపోయింది. ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి పండుగ సందడిలో విడుదలై ఇప్పటివరకూ రూ. 40 కోట్లు వసూలు చేస్తే మణికర్నిక కేవలం 3 రోజుల్లోనే రూ. 42.55 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రూ. 100 కోట్ల క్లబ్బులోకి వెళ్లినా ఆశ్చర్యపడక్కర్లేదంటున్నారు. 
 
మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్, మణికర్నిక చిత్రాలకు క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఆయనకు చేదు గుళిక మిగిల్చింది. మణికర్నిక విషయానికి వస్తే... ఆయన చిత్రం దర్శకత్వం చేస్తూ వైదొలిగాడు. ఐతే మొత్తం చిత్రాన్ని తనే తీసినట్లయితే మణికర్నిక ఇంకా ఎక్కడికో వెళ్లిపోయేదని అంటున్నారట. మొత్తమ్మీద మణికర్నిక హిట్ క్రిష్ కుళ్లుకునేలా చేసిందని అంటున్నారు.