గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 13 జనవరి 2019 (15:18 IST)

'కథానాయకుడు' కలెక్షన్ల కంటే నాదెండ్ల ఇంటర్వ్యూకే వ్యూస్ ఎక్కువ : వర్మె సెటైర్లు

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తొలి భాగం ఎన్టీఆర్ కథానాయుకుడు. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే, ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటల్లో రెండు పాటలు (వెన్నుపోటు, ఎందుకు) ఆయన విడుదల చేయగా, వాటికి మంచి స్పందన వచ్చింది. 
 
తాజాగా క్రిష్ దర్శకత్వంలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయుకుడు చిత్రంపై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ కథానాయుకుడు చిత్ర కలెక్షన్ల కంటే ఎన్టీఆర్, చంద్రబాబులపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకే ఎక్కువ వ్యూస్ వచ్చాయంటూ ఎద్దేవా చేశారు. అంటే.. జరగబోయేదాన్ని ఎవరూ అంచనా వేయలేరు అనడానికి ఇదే నిదర్శనమంటూ ఆయన ట్వీట్ చేశారు.