శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (10:16 IST)

వచ్చేయేడాది ఏప్రిల్ వరకు ఫుల్ బుక్కింగ్స్.. పెళ్లికి టైం ఎక్కడుంది?

టాలీవుడ్ 'మహానటి' కీర్తి సురేష్‌ త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో ప్రేమలోపడిందనీ, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటికాబోతున్నట్టు ప్రచారం జరిగింది. 
 
ఈ వార్తలపై కీర్తి సురేష్ ఓ క్లారిటీ ఇచ్చారు. త‌న పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల్లో రవ్వంత కూడా నిజంలేదు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు నా కాల్షీట్స్ డైరీ ఫుల్‌గా ఉంది. ఈ త‌రుణంలో పెళ్లి ఎలా చేసుకుంటాను. దయచేసి ఇలాంటి వార్త‌ల‌ను వ్యాప్తి చేయ‌కండి అన్నారు. 
 
కాగా, ప్రస్తుతం కీర్తి సురేష్ పలు చిత్రాల్లో బిజీగా ఉంది. ముఖ్యంగా, యువ హీరో నితిన్ నటిస్తున్న 'రంగ్ దే' చిత్రంతో పాటు.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ - శివ కాంబినేషన్‌లో తెరకెక్కే 'అణ్ణాత్త' సినిమాతో పాటు.. పలు చిత్రాల్లో నటిస్తోంది.