విపరీతమైన దుమ్ములో ఆగడు షూటింగ్... మహేష్‌కు జ్వరం!

Ganesh| Last Updated: సోమవారం, 30 జూన్ 2014 (12:41 IST)
డైరెక్టర్ శ్రీనువైట్ల, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "ఆగడు". దూకుడు వంటి హిట్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై భారీగా అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బళ్ళారిలోని జరుగుతోంది. అక్కడ మహేష్‌పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

తాజాగా బళ్ళారి సమీపంలోని జిందాల్ స్టీల్ ప్లాంట్‌లో గత ఐదు రోజులుగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో మహేష్‌పై
భారీ ఎత్తున ఓ పాటని కూడా చిత్రీకరించారు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలతో పాటు వినోదాత్మక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ షూటింగ్‌లో పాల్గొంటూ మహేష్ మొన్ననే పునీత్ రాజ్ కుమార్ ఆడియోకి హాజరైన విషయం తెలిసిందే. ఐతే అక్కడ విపరీతమైన దుమ్ములో షూటింగ్ చేస్తుండటం వల్ల మహేష్‌కు కాస్త జ్వరం కూడా వచ్చిందట! దాంతో కొద్దిసేపు షూటింగ్‌ని నిలిపి వేసారని సమాచారం.

దీనిపై మరింత చదవండి :