శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 29 ఏప్రియల్ 2020 (14:16 IST)

బంగార్రాజు గురించి నాగ్ స్కెచ్ ఇదే

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాల్లో సోగ్గేడే చిన్నినాయానా ఒకటి. ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. పల్లెటూరు నేపధ్యంతో రూపొందిన ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ చాలా సహజంగా ఉండటం, కథలో కొత్తదనం ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 
 
బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 50 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన తొలి సీనియర్ హీరోగా నాగార్జునకు ఓ రికార్డును అందించింది ఈ సినిమా. అందుకనే ఈ సినిమా నాగార్జునకు, ఆయన అభిమానులకు సోగ్గాడే చిన్ని నాయానా ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పచ్చు. ఈ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు అనే క్యారక్టర్ బాగా పాపులర్ అయ్యింది. అందుకనే బంగార్రాజు టైటిల్‌తో సినిమా చేయాలని నాగార్జున అప్పుడే ఫిక్స్ అయ్యారు. 
 
అంతేకాకుండా.. బంగార్రాజు అనే టైటిల్‌ను రిజిష్టర్ కూడా చేయించారు. దీంతో సోగ్గాడే చిన్ని నాయానా సినిమాకి బంగార్రాజు సీక్వెల్ అంటూ ప్రచారం జరిగింది కానీ.. వాస్తవం ఏంటంటే సోగ్గేడి చిన్ని నాయానా చిత్రానికి బంగార్రాజు సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్. గత కొంతకాలం బంగార్రాజు స్క్రిప్ట్ పైన కళ్యాణ్ కృష్ణ అండ్ టీమ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇందులో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
 
అయితే... ఈ సినిమాని ఎప్పుడు చేసినా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నానని నాగ్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైన ఉండాలి. ఎప్పుడో రిలీజ్ అయ్యుండాలి కానీ.. కొన్ని కారణాల వలన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం అవుతూనే ఉంది. 2021 సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేయడంతో బంగార్రాజు సినిమాని క్రిస్మస్‌కి కానుకగా డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. 
 
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ జనవరి 8న రిలీజ్ కావడం లేదని... సమ్మర్‌కి పోస్ట్‌పోన్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అందుచేత నాగార్జున బంగార్రాజు సినిమాని ముందుగా అనుకున్నట్టుగా 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలనకుంటున్నారని తెలిసింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. స్ర్కిప్ట్ కూడా రెడీ అయ్యింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, ఎప్పుడైతే షూటింగ్స్‌కి పర్మిషన్ ఇస్తారో అప్పుడు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అంతేకాకుండా... సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాని కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. 2021 సంక్రాంతికి బంగార్రాజు రిలీజ్ కావడం ఖాయం అంటున్నారు. మరి.. బాక్సాఫీస్ వద్ద బంగార్రాజు ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.