మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:18 IST)

జియో సూపర్ కాంబో ప్లాన్.. రూ.199కి 1000 జీబీ డేటా

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో.. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరికొందరు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా వినియోగం భారీగా పుంజుకుంది. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని టెలికాం రంగ సంస్థలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. 
 
తాజాగా రిలయన్స్ జియో ఫైబర్ (ఫైబర్-టు-హోమ్) వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన కాంబో ప్లాన్‌ను ప్రకటించింది. రూ.199లకు వేగవంతమైన 1000 జీబీ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఈ ప్లాన్ వాలిడిటీ స్వల్ప కాలం అంటే 7 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, ఈ ప్లానులో డేటా 100 ఎంబీపీఎస్ వేగంతో వస్తుంది. మరో విషయం ఏమిటంటే, రూ. 199 కాంబో ప్లాన్ జీఎస్టీతో కలిపి మొత్తం రూ. 234 ఖర్చు అవుతుంది. దీంతోపాటు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.
 
ఈ కాంబో ప్లాన్ ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అయిపోయిన వారికి, లేదా అదనపు డేటా అవసరం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే లిమిట్ దాటిన అనంతరం ఇది ఒక ఎంబీపీఎస్‌కు పడిపోతుందని వెల్లడించింది.