గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (17:18 IST)

మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం.. అఖండ 2లో కనిపిస్తాడా?

MOkshagna_NTR
నందమూరి ఫ్యాన్స్‌కి శుభవార్త. బాలయ్య బాబు వారసుడు సినిమాల్లో కనిపించనున్నాడు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నటన, డ్యాన్స్ విషయాల్లో మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నారు.
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందుతున్నారు. మెగా హీరోలకు, ప్రభాస్‌కు, పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలకు సత్యానంద్ శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
 
'ఆదిత్య 369' సీక్వెల్ తో ఆయన అరంగేట్రం ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా బాలయ్యతో 'అఖండ 2'కు బోయపాటి శ్రీను స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రంలో మోక్షజ్ఞ కోసం ఓ ప్రత్యేక పాత్రను ఆయన రెడీ చేసినట్ట సమాచారం.