శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 15 ఆగస్టు 2018 (20:08 IST)

సిల్క్ స్మిత జీవిత చ‌రిత్ర‌ను వాడేస్తానంటున్న డైరెక్టర్

శృంగార తార సిల్క్ స్మిత జీవిత చ‌రిత్ర‌ను తెర‌కెక్కించ‌నున్న పాపుల‌ర్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌తో క‌బాలి, కాలా చిత్రాల‌ను తెర‌కెక్కించిన యువ ద‌ర్శ‌కుడు రంజిత్. అవును.. రంజిత్ సిల్క్ స్మిత జీవిత చ‌రిత్ర‌ను తెర‌కెక్కించ

శృంగార తార సిల్క్ స్మిత జీవిత చ‌రిత్ర‌ను తెర‌కెక్కించ‌నున్న పాపుల‌ర్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌తో క‌బాలి, కాలా చిత్రాల‌ను తెర‌కెక్కించిన యువ ద‌ర్శ‌కుడు రంజిత్. అవును.. రంజిత్ సిల్క్ స్మిత జీవిత చ‌రిత్ర‌ను తెర‌కెక్కించాలి అనుకుంటున్నార‌ట‌. క‌బాలి, కాలా చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌డంతో త‌ర్వాత ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యంపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపించింది.
 
ఆ త‌ర్వాత అమీర్ ఖాన్ కాదు త‌మిళ స్టార్ హీరోతో రంజిత్ త‌దుప‌రి సినిమా ఉంటుంద‌ని టాక్ వినిపించింది. తాజా వార్త ఏంటంటే.. అలనాటి నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దాదాపుగా సౌత్‌తో పాటు హిందీ భాషలో కలిపి 450 చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత 1996లో ఆత్మహత్య చేసుకుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టించనున్నారు. మ‌రి.. సిల్క్ స్మిత పాత్ర‌ను ఎవ‌రు పోషిస్తారో చూడాలి.