గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: సోమవారం, 13 ఆగస్టు 2018 (22:13 IST)

మ‌న్మ‌థుడు 2లో హీరో ఎవ‌రు..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్ర‌స్తుతం దేవ‌దాస్ సినిమా చేస్తున్నారు. నాగ్ - నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్నారు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ నిర్మిస్తోన్న ఈ మూవీ శ‌

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్ర‌స్తుతం దేవ‌దాస్ సినిమా చేస్తున్నారు. నాగ్ - నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్నారు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ నిర్మిస్తోన్న ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. సెప్టెంబ‌ర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. అయితే... ఈ సినిమా త‌ర్వాత నాగ్ సొగ్గాడే చిన్ని నాయ‌నా ప్రీక్వెల్ బంగార్రాజు చేయ‌నున్న‌ట్టు తెలిసింది.
 
ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని ఎనౌన్స్ చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే... అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పైన మ‌న్మ‌థుడు 2 అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారని వార్త‌లు వ‌స్తున్నాయి. బంగార్రాజు సినిమాతో పాటు నాగ్ చి.ల.సౌ డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ష‌న్లో కూడా మూవీ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. మ‌న్మ‌థుడు 2 టైటిల్ నాగ్ కోస‌మా..? లేక నాగ‌చైత‌న్య లేక అఖిల్ కోస‌మా అనేది తెలియాల్సి వుంది.