శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (14:31 IST)

గొడుగు పట్టుకుంటే నీ స్థాయి తగ్గిపోతుందా? అది 100 కిలోల బరువుంటుందా? పరిణీతిపై ఫైర్

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో ఓ ఫోటోను పెట్టి వివాదాన్ని కొని తెచ్చుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా తన ఇన్‌స్ట్రాగామ్‌లో దుబాయ్‌ బీచ్‌లో నడుస్తూ తీసుకున్న వీడియోను షే

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో ఓ ఫోటోను పెట్టి వివాదాన్ని కొని తెచ్చుకుంది.  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా తన ఇన్‌స్ట్రాగామ్‌లో దుబాయ్‌ బీచ్‌లో నడుస్తూ తీసుకున్న వీడియోను షేర్‌ చేశారు.  ప్రస్తుతం ఆమె 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పనిమీదే ఆమె దుబాయ్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దుబాయ్‌ బీచ్‌లో పరిణీతి అసిస్టెంటు మూడు బ్యాగులను మోస్తూ.. ఆమెకు గొడుగు పట్టుకుని నడుస్తున్నాడు. 
 
ఆమె హ్యాండ్ బ్యాగును కూడా అతడు మోశాడు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు పరిణీతిని తీవ్రంగా విమర్శించారు. 'గొడుగు పట్టుకుంటే నీ స్థాయి తగ్గిపోదు, గొడుగు కచ్చితంగా 100 కిలోల బరువుంటుంది' లాంటి వ్యాఖ్యలతో విమర్శించారు. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వీడియోను డిలీట్‌ చేశారు. పరిణీతి చోప్రాకు ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ పరిణీతి చోప్రా రెండుమూడుసార్లు సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురైయ్యారు. తనని అర్థం చేసుకోకుండా విమర్శించేవారంతా తనకు తెలియనివారని, వారి గురించి తాను పట్టించుకోనని పరిణీతి పేర్కొన్నారు.