శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (12:06 IST)

పవన్ - త్రివిక్రమ్ మూవీ ఫస్ట్ లుక్ లీక్ : సోషల్ మీడియాలో వైరల్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నిజానికి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అయినా, ఇంకాదానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా బయటకు పొక్క

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నిజానికి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అయినా, ఇంకాదానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా బయటకు పొక్కలేదు కదా కనీసం టైటిల్ కూడా వెల్లడి కాలేదు. 
 
కానీ, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టిల్ హల్‌చల్ చేస్తోంది. గడ్డంతో ఉన్న పవన్, మెడలో స్కార్ఫ్‍‌తో, చేతిలో గొడుకు పట్టుకుని కూర్చున్న ఫోటో ఇది. అయితే, ఇందులో పవన్ గడ్డంతో ఉండటంతో ఇది గతంలో తీసిన ఫోటో అయ్యుండవచ్చన్న వాదనా వస్తోంది. 
 
కానీ, ఈ చిత్రాన్ని ఎవరూ ఎప్పుడూ చూడకపోవడంతో, కొత్త సినిమాలో పవన్ లుక్ ఇదేనని చాలా మంది నమ్ముతున్నారు. ఇక ఏది నిజమో తెలుసుకోవాలంటే, అధికారికంగా ఫస్ట్ లుక్ వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.