శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 20 నవంబరు 2020 (20:05 IST)

పునర్నవితో ప్రేమ, ఆశు రెడ్డి యువతితో డేటింగ్

టాలీవుడ్ సింగర్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 రియాలిటీ షోతో ఆ క్రేజ్‌ను మరింత  పెంచుకున్నాడు. బిగ్ బాస్ షోలో ఉన్నంతవరకు ఆట ఆడుతూ పాటలు పాడుతూ పునర్నవిని ఇంప్రెస్ చేశాడు రాహుల్. వీరిద్దరి లవ్ ట్రాక్ గేమ్‌లో హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
 
హౌస్‌లో వీరిద్దరు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. ఆ తరువాత కూడా రాహుల్, పునర్నవిలు రిలేషన్ కొనసాగుతోందనీ, వీరిద్దరి ప్రేమ పెళ్ళి పీటలెక్కుతుందన్న ప్రచారం బాగానే జరిగింది.
 
తాజాగా రాహుల్ మరో బిగ్ బాస్ బ్యూటీతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించాడు. బిగ్ బాస్ కంటెన్టెంట్ ఆశురెడ్డితో రిలేషన్లో ఉన్నాడట. ఆమెతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు రాహుల్. దీంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. బిగ్ బాస్ కంటెన్టెంట్ ఆశురెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది.
 
అయితే పునర్నవి తనకు ఎంగేజ్‌మెంట్ అంటూ ఒక ఫోటో పెట్టి ఆ తరువాత ఇదంతా నిజం కాదని చెప్పింది. అలాగే రాహుల్ కూడా ఫోటోను పోస్ట్ చేసి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. కానీ రాహుల్ పంపిన ఫోటోలో ఉన్న అమ్మాయితో డేటింగ్‌లో కూడా రాహుల్ ఉన్నట్లు బాగానే అభిమానులు సందేశాలు పోస్ట్‌లు చేస్తున్నారట.