శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (18:14 IST)

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో బాలీవుడ్ హీరో ప్రియురాలికి లింకు?? (video)

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు తర్వాత బాలీవుడ్ చిత్రపరిశ్రమలో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలు అత్యంత కీలక పాత్ర పోషించినట్టు తేలింది. అంతేకాకుండా, ఇందులో పలువురు హీరోయిన్లకు కూడా లింకులు ఉన్నట్టు తేలడంతో వారివద్ద కూడా నార్కోటిక్స్ కంట్రోల్స్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరిపింది. 
 
ఈ క్రమంలో తాజా ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో కూడా ఎన్సీబీ విచారణ జరిపింది. అలాగే, ఇపుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్లా దెమిత్రియాడెన్‌ను బుధవారం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు విచారించారు. 
 
గత సోమవారం అర్జున్ రాంపాల్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణకు రావాలంటూ రాంపాల్‌తోపాటు ఆయన ప్రేయసి గాబ్రియెల్లాకు సమన్లు జారీ చేశారు. అందులో భాగంగా బుధవా మధ్యాహ్నం ఆమె ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకోగా, అధికారులు ఆమెను విచారించారు. మరోవైపు హీరో అర్జున్ రాంపాల్‌ గురువారం ఎన్సీపీ వద్ద విచారణకు హాజరుకానున్నారు.