సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By మనీల
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (12:15 IST)

ధనుష్ మూవీపై కన్నేసిన చరణ్...

మలయాళంలో పెద్ద హిట్టైన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చరణ్ ఆ చిత్ర రిమేక్ హక్కులను దక్కించుకున్నాడు. మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి కథానాయకుడిగా ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో చరణ్ వున్నాడు. కొరటాల మూవీ తరువాత ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చరణ్ తమిళ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
 
తమిళంలో ధనుష్ హీరోగా చేసిన 'అసురన్' దసరాకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుష్ ఖాతాలో మరో భారీ హిట్.. కేవలం హిట్ కొట్టడమే కాదు .. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. చాలా వేగంగా ఈ సినిమా అక్కడ 100 కోట్ల క్లబ్‌‌‌‌లోకి చేరిపోయింది.

ధనుశ్ నటనకు అవార్డులు దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే 'అసురన్' రీమేక్ హక్కులపై చరణ్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.