శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (17:18 IST)

అందుకే పెళ్లి చేసుకున్నట్లు నటించాం.. రష్మీ గౌతమ్

యాంకర్, నటి రష్మీ గౌతమ్ తాజాగా అంతకు మించి సినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా వుంది. తాజాగా సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం పెళ్లిపై రష్మీకి ప్రశ్న ఎదురైంది. ఓ రియాలిటీ షో కోసం సుడిగాలి సుధీర్‌ తాను పెళ్లి చ

యాంకర్, నటి రష్మీ గౌతమ్ తాజాగా అంతకు మించి సినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా వుంది. తాజాగా సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం పెళ్లిపై రష్మీకి ప్రశ్న ఎదురైంది. ఓ రియాలిటీ షో కోసం సుడిగాలి సుధీర్‌ తాను పెళ్లి చేసుకున్నట్లు నటించామని చెప్పింది. కేవలం షో కోసం, జనాలను నవ్వించడానికి అలా చేశామంది. ఆ తరువాత దానిపై వివరణ కూడా ఇచ్చాము.
 
అయితే అవేవీ పట్టించుకోకుండా నిజంగానే పెళ్లి జరిగిందన్నట్లు జోరుగా ప్రచారం చేశారు. అందులో వాళ్ల తప్పేంలేదు. ఏదొక రోజు ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఇద్దరి పెళ్లి ఒకే వేదికపై పక్క పక్కనే జరగాలని చెప్తుంటాను అని చెప్పింది. 
 
ఎందుకంటే తాను ముందు పెళ్లి చేసుకుంటే.. సుధీర్‌ని మోసం చేశానని అంటారు. అతడు ముందు పెళ్లి చేసుకుంటే అతడు మోసం చేశాడని అంటారు. అందుకే ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలి అన్నట్లుగా అతడితో చెబుతుంటాను. సుధీర్‌తో తనకు మంచి సంబంధం వుంది. ఒకరినొకరు గౌరవించుకుంటామని రష్మీ చెప్పుకొచ్చింది.