శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (10:30 IST)

టాలీవుడ్‌ సినిమాలో విలన్ అవతారంలో రవీనా టాండన్?

raveena tandon
టాలీవుడ్‌లో సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ వంటి బాలీవుడ్ తారలు నెగిటివ్ రోల్స్ చేస్తున్న నేపథ్యంలో, తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ విలన్ అవతారం ఎత్తనుంది. రాబోయే తెలుగు చిత్రం 'జటాధార'లో విలన్‌గా నటించనుంది. 
 
రవీనా టాండన్ జటాధారలో అద్భుతమైన రోల్‌లో కనిపిస్తుందని దర్శకుడు వెంకట్ కళ్యాణ్ చెప్పారు. "నేను ఆమెకు కథను వివరించినప్పుడు, ఆమెకు కాన్సెప్ట్ నిజంగా నచ్చింది. మా సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో సుధీర్ బాబు, రవీనా టాండన్ మధ్య సూపర్ సీన్స్ వుంటాయి. ఇవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి" అని తెలిపారు.
 
ఇంతకుముందు, రవీనా టాండన్ తెలుగు చిత్రాలలో పనిచేసింది. నాగార్జున (ఆకాశ వీధిలో), బాలకృష్ణ (బంగారు బుల్లోడు), పాండవులు పాండవులు తుమ్మెదలో కనిపించింది.
 
ఇకపోతే.. 'డబుల్ ఇస్మార్ట్'లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్‌ను టాలీవుడ్ మేకర్స్ నటింపజేయగా, సైఫ్ అలీ ఖాన్ 'దేవర'లో విలన్ పాత్రలో కనిపించనున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో బాలకృష్ణ తన 109వ చిత్రంలో బాబీ డియోల్‌ను తీసుకోనున్నారు.