సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 11 మార్చి 2024 (19:08 IST)

మళ్లీ మొదలు పెట్టిన సమంత

Samantha Ruth Prabhu
కర్టెసి-ట్విట్టర్
సమంత. టాలీవుడ్ గ్లామర్ క్వీన్. అంతేకాదు, పెర్ఫార్మెన్సులోనూ ఆమెకి ఆమే సాటి. ఈమధ్య కాలంలో మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటోంది. తాజాగా ఈ అమ్మడు దిగిన గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గ్లామర్ డోస్‌ను ఎంత పెంచాలో అంతస్థాయిలో పెంచుతూ సమంత ఇటీవల షేర్ చేసిన ఫోటోలపై ఫ్యాన్స్ కామెంట్లు చేసుకుంటున్నారు.
 
మాకు పాత సమంత కావాలి
బాహ్య గాయాల కంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుందని హీరోయిన్ సమంత అన్నారు. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ, 'మనపై మనకున్న విశ్వాసం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సాయపడుతుంది. నేను అభద్రతాభావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగాను. త్వరగా దాని నుంచి బయటకు వచ్చాను. బాహ్య గాయాల కంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది' అని కామెంట్స్ చేశారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో విడాకుల అంశాన్ని మనసులో పెట్టుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. 
 
'గ్లామర్‌గా ఉన్నావు' అని ఒకరు అనగా.. 'నిజంగా సమంతనేనా.. ఏఐ ఇమేజా' అని మరొకరు సందేహం వ్యక్తం చేశారు. 'మాకు పాత సమంతనే కావాలంటూ' పలువురు కోరుతున్నారు. కాగా, గతేడాది 'శాకుంతలం', 'ఖుషి' చిత్రాలతో పలకరించిన సమంత ప్రస్తుతం మరో ప్రాజెక్ట్‌ ఓకే చేయలేదు. ఆమె నటించిన వెబ్‌సిరీస్‌ 'సిటాడెల్‌' (ఇండియన్‌ వెర్షన్‌) విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌ హీరో. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. దీనితో పాటు 'ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌' నిర్మాణ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు.