ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మార్చి 2024 (12:25 IST)

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

Samantha
డిజిటల్ యుగంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రాణిస్తోంది. హీరోయిన్‌గా ఓవైపు సోషల్ మీడియాలో మరోవైపు తన సత్తాను చాటుకుంటోంది. స్టార్ సైరన్ సమంత రూత్ ప్రభు తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ హెల్త్ పాడ్‌కాస్ట్ చేయడం ప్రారంభించింది.
 
ఆమె తన మైయోసైటిస్ గురించి అనేక విషయాలను షేర్ చేస్తోంది. ఆటో ఇమ్యూన్ కండిషన్ ట్రాప్‌లో పడకుండా ప్రజలు ఆచరించాల్సిన మార్గాలను పేర్కొంది. 
 
ఆమె పోడ్‌కాస్ట్ రెండవ ఎపిసోడ్ ప్రస్తుతం విడుదలైంది. ఇందులో ఆమె మొదటి ఎపిసోడ్‌కు 2 వారాల్లో 145K వీక్షణలు వచ్చాయి. రెండవ ఎపిసోడ్‌కు 6 రోజుల్లో 43K వీక్షణలు మాత్రమే వచ్చాయి. 
 
ఆశ్చర్యకరంగా స్టార్ హీరోయిన్ ‘ఊ అంటావా’ తెర వెనుక వీడియోని యూట్యూబ్‌లో ‘షార్ట్‌’గా షేర్ చేయగా, అది కేవలం 3 రోజుల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.