గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 జులై 2017 (14:14 IST)

పెద్ద త‌ప్పుచేసినట్లు.. మోసం చేసిన‌ట్లు బూతులు తిట్టారు: స‌ంపూర్ణేష్ బాబు

తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఉన్న యువ హీరోల్లో సంపూర్ణేష్ బాబు ఒకరు. హృదయ కాలేయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమై ఓ గుర్తింపును సొంతం చెసుకున్నాడు. ముఖ్యంగా.. తెలుగు సినిమాల్లో ఉండే ఓవ‌ర్ యాక్ష‌న్‌ను క‌ళ్

తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఉన్న యువ హీరోల్లో సంపూర్ణేష్ బాబు ఒకరు. హృదయ కాలేయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమై ఓ గుర్తింపును సొంతం చెసుకున్నాడు. ముఖ్యంగా.. తెలుగు సినిమాల్లో ఉండే ఓవ‌ర్ యాక్ష‌న్‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించి, క‌డుపుబ్బా న‌వ్విస్తుంటాడు. 
 
అయితే, చిత్రపరిశ్రమలో తనకు ఎదురై చేదు అనుభవాలపై ఆయన తాజాగా స్పందించారు. హృదయ కాలేయం చిత్రం విడుద‌లైన తర్వాత‌ త‌న‌కు ఎవ‌రెవ‌రో ఫోన్లు చేసి, తానేదో పెద్ద త‌ప్పుచేసినట్లు, మోసం చేసిన‌ట్లు బండ‌ బూతులు తిట్టారని చెప్పారు. 
 
ఆ సినిమా ఏంటీ? నువ్వు హీరో ఏంటీ? అని ఎన్నో మాట‌లు అనేవార‌ని అన్నాడు. దీంతో త‌న‌కు ఫోన్ వ‌స్తే ఎత్తాలంటే భ‌యం వేసేదని చెప్పాడు. జీవితంలో ఎవ్వ‌రికీ అలాంటి బాధ రాకూడ‌ద‌ని అనుకున్నానని తెలిపాడు.
 
త‌న‌కు డ్యాన్స్ బాగా చేయాల‌నిపిస్తుందని కానీ, త‌న‌కు డ్యాన్స్ రాదని చెప్పాడు. ప్రతిసారి తాను ఏది అవ‌స‌ర‌మో అదే నేర్చుకుని, అక్క‌డే మ‌ర్చిపోతానని చెప్పాడు. తన‌కు ఓ న‌టుడు కావాల‌ని చిన్నప్పటి నుంచీ కోరిక ఉండేద‌ని, ఏకంగా హీరోనే అయిపోయాన‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశాడు.