శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 31 డిశెంబరు 2020 (19:56 IST)

విదేశాలకు వెళ్లేందుకు శివాజీ యత్నం, అడ్డుకున్న అధికారులు?

అమెరికా వెళుతున్న సినీ హీరో శివాజీని దుబాయ్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. గతంలో అమెరికాకు వెళుతూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దొరికారు శివాజీ. అలంద మీడియా కేసులో గతంలో శివాజీపై లుకౌట్ నోటీసులు వచ్చాయి. 
 
అప్పటి నుంచి శివాజీ తప్పించుకుని తిరుగుతున్నాడు. నోటీసులు వచ్చినా ఇమిగ్రేషన్ ముందు హాజరు కాకపోవడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వారికి ఇచ్చిన నోటీసులు ప్రకారం దేశం విడిచి వెళ్ళకూడదు. అయితే గతంలోను అలాగే చేస్తూ అధికారుల కంట్లో పడ్డారు.
 
శివాజీకి గతంలోను ఇమిగ్రేషన్ అధికారులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే వినిపించుకోని శివాజీ దుబాయ్ వెళ్లేందుకు సిద్థమైపోయాడు. దీంతో సమాచారం అందుకున్న వారు వెంటనే ఆయన్ను అడ్డుకున్నారు. వెళ్ళనివ్వలేదు. ఎయిర్‌పోర్ట్ నుంచి తిప్పి పంపించేశారు.