బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (14:27 IST)

వాచీ కోసం ఫోటో షూట్ ఇస్తే... దాని గురించి కాకుండా దేని గురించో మాట్లాడుతున్నారట...

Sradha Dass
శ్రద్ధా దాస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో బహు తక్కువ సినిమాల్లో నటించిన ఈమె గ్లామర్ డోస్ పెంచినా అవకాశాలు అంతంతమాత్రంగానే వున్నాయి. దీనితో ప్రస్తుతం ఆమె ఈవెంట్లకు, ఫోటోషూట్లకు ప్రాధాన్యతనిస్తోందని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. తాజాగా ఆమె ఓ వాచీ ప్రమోషన్ కోసం ఇచ్చిన ఫోటోలు వైరల్ అయ్యాయి. 
వాచీ కోసం ఆమె ఫోజులిచ్చింది కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమె చేతికున్న వాచీ గురించి మాట్లాడకుండా ఆమె అందాల ప్రదర్శన గురించి ఎక్కువ మాట్లాడుతున్నారట. ఇంతటి బ్యూటిఫుల్ హీరోయిన్ అయిన శ్రద్ధా దాస్‌కి అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదూ అంటూ మండిపడుతున్నారట.
శ్రద్ధా ఇచ్చిన ఫోటోషూట్ స్టిల్స్ చూసైనా నిర్మాతలు మనసు మార్చుకుని అవకాశాలు ఇస్తారేమో చూద్దాం.