1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (13:40 IST)

ప్రేమలో పడాలని వుంది.. కానీ టైమ్ లేదు.. శ్రీలీల

Sreeleela
ప్రేమలో పడాలని వుందని సినీ నటి హీరోయిన్ శ్రీలీల మనసులోని మాటను బయటపెట్టింది. స్కంద సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన శ్రీలీల.. తాను ఇప్పటివరకు ప్రేమలో పడలేదని.. కాబట్టి బ్రేకప్ అనే ప్రశ్న ఎక్కడదని యాన్సర్ చేసింది. ఇప్పటివరకు సింగిల్ అని.. ప్రేమలో పడాలని వుందని తెలిపింది. 
 
ప్రతి ఒక్కరూ ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని.. అలాంటి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. కానీ ప్రేమలో పడి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించే సమయం తనకు లేదని తెలిపింది. శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్.
 
స్కంద ప్రమోషన్స్‌లో భాగంగా బ్రేకప్ ప్రశ్నకు పైవిధంగా స్పందించింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.