బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 జులై 2017 (12:12 IST)

రాజమౌళి సినిమాలో శ్రీదేవి.. మోహన్ లాల్ సరసన అతిలోకసుందరి?

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో ప్రభాస్, అనుష్కలతో పాటు శివగామిగా రమ్యకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. శివగామి రోల్‌కు ముందుగా శ్రీదేవిని సంప్రదించినట్టు ఆమెను అధిక పారితోషికం అడగటంత

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో ప్రభాస్, అనుష్కలతో పాటు శివగామిగా రమ్యకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. శివగామి రోల్‌కు ముందుగా శ్రీదేవిని సంప్రదించినట్టు ఆమెను అధిక పారితోషికం అడగటంతో అంగీకరించలేదని.. ఓపెన్‌గా రాజమౌళి చెప్పడం వివాదానికి దారితీసింది. అయితే ఈ వివాదానికి తెరదించే దిశగా దర్శకధీరుడు ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్‌లో టాక్. 
 
ఈ నేపథ్యంలో రాజమౌళి.. తన తదుపరి సినిమాలో శ్రీదేవికి మంచి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. మోహన్ లాల్ కథానాయకుడిగా, శ్రీదేవి హీరోయిన్‌గా రాజమౌళి సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తారా? లేకుంటే కీలక పాత్రల్లో కనిపిస్తారా? యంగ్ హీరోహీరోయిన్లుగా జక్కన్న ఎవరిని తీసుకోనున్నారు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే మోహన్ లాల్ మహాభారతంలో భీముని పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రని అధిక పారితోషికం డిమాండ్ చేశానని తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన శ్రీదేవి.. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో అలా చీప్‌గా మాట్లాడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన రాజమౌళి.. శ్రీదేవి మాట్లాడిన మాటలు, తాను మాట్లాడిన మాటలు ఆల్రెడీ పబ్లిక్‌లోకి వెళ్లిపోయాయి. అందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది గ్రహించే వివేకం ఆడియెన్స్‌కి వుంది. కాకపోతే అసలు తాను శ్రీదేవి గురించి మాట్లాడి వుండకపోయుంటే ఈ వివాదం ఇంత పెద్దది అయ్యుండేది కాదేమోనని రాజమౌళి అన్నారు.