శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (22:28 IST)

నాపై రూమర్స్ ఆపండి, బాధేస్తోంది: సోనూసూద్ (video)

తోచిన సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు సోనూసూద్. అవసరమన్న వారందరికీ తన వంతు సాయం చేస్తూ ఆదుకుంటున్నారు. తనకు తోచిన సహాయం చేస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నారు. అయితే కొంతమంది సోనూసూద్‌ను బాధిస్తున్నారట. అది ఏమాత్రం సోనూసూద్‌కు నచ్చడం లేదట.
 
నేను ఒక సాధారణ వ్యక్తిని. మీలో ఒకడిని. నన్ను అనవసరంగా ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తించకండి. నాపై రూమర్స్ ఆపండి. మీరు అలా చేస్తే నేను తట్టుకోలేను. బాగా బాధపడుతున్నాను అంటూ సోనూసూద్ తాజాగా ఒక సందేశాన్ని అభిమానులకు పంపాడు. 
 
ఇంతకీ ఆ సందేశం పంపడానికి అసలు కారణమేంటంటే.. ఇషాన్‌కు 3 కోట్ల రూపాయలు పెట్టి కారును కొనుగోలు చేసినట్లు కొంతమంది ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. ఫాదర్స్ డే రోజు ఇంటికి కారును తీసుకొచ్చారని.. జల్సాల రాయుడు సోనూసూద్ అంటూ ఫోటోలను వైరల్ చేశారు.
 
దీంతో సోనూసూద్ బాధపడ్డారట. అభిమానుల సందేశాలకు తాను మరో సందేశాన్ని పంపాడు. కేవలం ఆ కారును టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకువచ్చాం. ఒక రౌండ్ కారును నడిపాం..అంతే.. కారును కొనలేదు. ఇలా అనవసరంగా నాపై రూమర్స్ చేయవద్దండి.. ఇది జనాల్లోకి వెళితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వారికి నాపై ఉన్న గౌరవం తగ్గుతుందంటూ సందేశం పంపారు.