శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (12:05 IST)

సుడిగాలి సుధీర్‌తో పెళ్లి.. రష్మీ గౌతమ్ సైలెంట్‌గా వుందే..

జబర్దస్త్ యాంకర్‌, హీరోయిన్ రష్మీ గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రష్మీ గౌతమ్ సారీల్లో ఫొటోలకు ఫోజులిస్తోంది. వాటిని క్రమం తప్పకుండా ఇన్ స్టాలో పోస్ట్ చేస్తోంది. కాజల్ అగర్వాల్ కూడా ఇలాగే చేసి పెళ్లి వార్తలో షాకిచ్చిన సంగతి తెలిసిందే.
 
రష్మి కూడా ఇదే తరహాలో షాకి ఇచ్చేందుకు సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని రష్మిగౌతమ్ ఫాలోవర్స్ అడిగితే మౌనంగా వుంటోంది. వారి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. దీంతో రష్మీగౌతమ్ కూడా కాజల్ తరహాలోనే షాకి ఇవ్వడానికి రెడీ అవుతోందంటూ ప్రచారం మొదలైంది. 
 
సుడిగాలి సుధీర్‌తో రష్మి ప్రేమలో వుందని, అందుకే వారిద్దరి మధ్య స్టేజ్‌పై మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అవుతోందంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల్ని ఇద్దరూ కొట్టి పారేసినా ఇప్పటికీ అదే నిజమని చాలామంది వాదిస్తున్నారు.