గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (13:03 IST)

ఐటెం గాళ్ తమన్నా భాటియాకు లక్కీ ఛాన్స్

Tamannaah Bhatia
Tamannaah Bhatia
తమన్నా భాటియా ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ తో విహార యాత్రకు వెళ్ళిన ఫొటోలు హల్ చల్ చేశాయి. ఇప్పుడు ఆమె పబ్లిసిటీని ఓ దర్శకుడు ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాాగా తెలుగు సినిమాలో ఆమెను తీసుకున్న ఛాన్స్ వుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. 
 
తమన్నా ఐటెం సాంగ్ లే కాకుండా హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా తీయనున్నట్లు తెలుస్తోంది. ఓదెల రైల్వే స్టేషన్ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వం వహించారు. అయినా అన్ని పనులు దర్శకుడు సంపత్ నంది పనులన్నీ చూసుకున్నాడు. ఆ సినిమా ఓటీటీలో విడుదలై మంచి రేటింగ్ తో ముందుకు సాగింది. ఇప్పుడు దాని సీక్వెల్ గా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో హెబ్బా పటేల్ నటించింది. కానీ సీక్వెల్ లో తమన్నాను తీసుకుంటున్నారట. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.