ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (12:25 IST)

'బాహుబలి-2' టిక్కెట్ కావాలా? అయితే 'బాహుబలి ది బిగినింగ్' మళ్లీ చూడండి...

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "బాహుబలి-2". ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ఈ చిత

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "బాహుబలి-2". ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో 'బాహుబలి-2' టిక్కెట్ దొరకడం అంత ఈజీ కాదు. అందుకే చిత్ర యూనిట్ ఓ తీపికబురు చెప్పింది. ఈనెల 7వ తేదీన 'బాహుబలి ది బిగినింగ్' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం టిక్కెట్ కొనుగోలు చేసే సినీ ప్రేక్షకులకు బాహుబలి-2 టిక్కెట్‌పై హామీ ఇచ్చారు. ఈనెల 7 నుంచి 17వ తేదీ వరకు ప్రదర్శితమయ్యే ఈ చిత్రాన్ని వీక్షించే ప్రేక్షకులకు మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చారు. 
 
మొదటిభాగం టికెట్లు కొనుగోలు చేసిన వారికి రెండో భాగం టికెట్‌ ఖచ్చితంగా ఇస్తారన్నమాట. అయితే, అదీ హిందీ వెర్షన్‌కు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ ఆఫర్‌ వర్తించదని తెలిపింది.