శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (20:29 IST)

వెంకీకి త‌న‌పై త‌న‌కి న‌మ్మ‌కం పోయిందా..?

విక్ట‌రీ వెంక‌టేష్.. గురు సినిమా స‌క్స‌ెస్ త‌ర్వాత పూరి, క్రిష్‌, కిషోర్ తిరుమ‌ల‌, తేజ‌ల‌తో సినిమాలు చేయాల‌నుకున్నారు. ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ ఈ సినిమాలు ఆగిపోయాయి. కొంత గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు ఓకే చేస్తూ ప‌క్కా ప్లాన్‌తో దూసుకెళుతున్

విక్ట‌రీ వెంక‌టేష్.. గురు సినిమా స‌క్స‌ెస్ త‌ర్వాత పూరి, క్రిష్‌, కిషోర్ తిరుమ‌ల‌, తేజ‌ల‌తో సినిమాలు చేయాల‌నుకున్నారు. ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ ఈ సినిమాలు ఆగిపోయాయి. కొంత గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు ఓకే చేస్తూ ప‌క్కా ప్లాన్‌తో దూసుకెళుతున్నాడు. అయితే... సీత‌మ్మ‌ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు ఓకే చెప్పిన వెంకీ ఇప్పుడు వ‌రుస‌గా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుండ‌టం విశేషం. 
 
మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి ఎఫ్ 2 అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. అలాగే యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీ ఓ సినిమా చేస్తున్నారు. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఇటీవ‌ల ప్రారంభ‌మైంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
 
అలాగే త‌మిళ స్టార్ హీరో సూర్య‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌కి వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని.. దీనికి నేను లోక‌ల్ ఫేమ్ న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కి వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఈ మ‌ల్టీస్టారర్‌లో వెంకీ, మ‌ల‌యాళ యువ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌తో క‌లిసి న‌టించ‌నున్నాడ‌ని తెలిసింది. అయితే... ఇలా వ‌రుస‌గా మ‌ల్టీస్టార‌ర్స్‌కి ఓకే చెబుతుండ‌టంతో సోలో హీరోగా స‌క్స‌ెస్ సాధించ‌లేన‌ని తెలుసుకున్నాడనీ, అందుకే వెంకీ ఇలా మ‌ల్టీస్టార‌ర్స్‌కి ఓకే చెబుతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజ‌మేనేమో..?