గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By SELVI.M
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (22:29 IST)

నన్ను సిల్క్ అని పిలవడం నచ్చింది: బింధుమాధవి

"ఆవకాయ్ బిర్యానీ" సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన బింధుమాధవి మీకు గుర్తుందా..? తొలి సినిమా ఫట్ కావడంతో బిందుమాధవికి టాలీవుడ్‌లో ఆశించిన అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్‌ ఆరంగేట్రం చేసిన ఈ భామ "కళుగు"అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా మోస్తరుగా ఆడటంతో అమ్మడుకు మంచి పేరొచ్చేసింది. 

ఇంకా చెప్పాలంటే గ్లామర్ పంట పండించేందుకు బిందుమాధవి రెడీగా ఉండటంతో ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. అలాగే బిందుమాధవి గ్లామర్ హీరోయిన్ దివంగత నటి సిల్క్ స్మిత ఫేస్ కట్‌తో ఉండటంతో ఆమెను అందరూ సిల్క్ అని పిలిచేస్తున్నారట. ఇలా సిల్క్ అని పిలవడం బింధుమాధవికి తెగ నచ్చిందని చెప్తోంది.

చనిపోయిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన నటి సిల్క్. ఆమెలా సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం కుదరని పని. అయితే నన్ను సిల్క్ అని పిలవడం నచ్చింది. కానీ ఆమె పేరుతో నన్ను పిలిపించుకునే అర్హత నాకుందా తెలియదు. అంటూ చెప్పుకొచ్చింది. ఇక నా ప్లస్ పాయింట్ నా కళ్లే. నా కళ్లు నటనా భావాలను ఉట్టిపడేలా చేసేందుకు ఎంతో సహకరిస్తాయని చెప్పింది.