బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Gulzar Ghouse

నీతూ చంద్ర ఏం కోరుకుంటోంది?

ప్రముఖ బాలీవుడ్ నటి నీతూ చంద్ర గతంలో నటించిన చిత్రాలలో అంతగా పేరు ప్రఖ్యాతలు రాలేదు. అదే బికినీ ధరించి ఫోటోలు తీయించుకోవడంతో ఒక్కసారిగా ఆమె వార్తలలో వ్యక్తిగా నిలబడింది. దీంతో మళ్ళీ ప్రజల కళ్ళల్లో పడింది. 

సమలైంగిక పరమైన ఫోజులిచ్చి ఫోటోలు తీయించుకోవడంతో బాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల కళ్ళు ఆమెపై పడ్డాయి. కురచ దుస్తులు ధరించడంలో ఆమెకు ఆమే సాటి అని బాలీవుడ్ కోడై కూస్తోంది.

ఇటీవల ఇచ్చిన బోల్డ్ ఫోటో సెషన్ తర్వాత ఆమె డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. గతంలో నీతూ సంప్రదించిన పెద్ద పెద్ద బ్యానర్లు అప్పట్లో ఆమెకు చోటు పెట్టలేదు, కానీ ఇప్పుడు తమ బ్యానర్లో సినిమా చేయాలంటే తమ బ్యానర్లో సినిమా చేయమని వెంటబడుతున్నారట.

ఇప్పటికే చాలామంది నిర్మాతలు ఆమెను తమ తమ చిత్రాల్లో బోల్డ్ అండ్ బికినీ సీన్లలో నటించాలని అడుగుతున్నారని సమాచారం. కానీ ఇటువంటి సన్నివేశాలలో నటించడానికి అంగీకరించాలా లేక నిరాకరించాలా అనేదానిపై ఆమె ప్రస్తుతం సంధిగ్దంలోనున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది.

కాగా ప్రస్తుతం ఆమె 'రణ్' చిత్రం విడుదలకోసం ఎదురు చూస్తోంది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఈ చిత్రంపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది. ఈ చిత్రం ద్వారా ఆమె ఓ మంచి నటిగా నిరూపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నీతూ స్నేహితురాలు ఒకరు అన్నారు.