శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (16:49 IST)

హాలిడే సీజన్ లో మౌత్ టాక్ తో దూసుకుపోతున్న 18 పేజెస్

nikil 18 pages
nikil 18 pages
బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ కార్తికేయ 2 తర్వాత, నిఖిల్ సిద్ధార్థ "18 పేజెస్"చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలాకాలం క్రితం పూర్తయిన ఈ రొమాంటిక్ డ్రామాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా కార్తికేయ కంటే ముందే పూర్తయిన, కార్తికేయ ముందు రిలీజై భారీ విజయం సాధించడంతో 18 పేజీస్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
 
క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు  వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. పాజిటివ్ రివ్యూలతో సినిమా 1వ రోజునే బ్రేక్ ఈవెన్ పొంది సంచలనం సృష్టించింది.
 
రోజులు గడుస్తున్నా కొద్ది 18 పేజీస్ చిత్రానికి అద్భుతమైన మౌత్ టాక్  కారణంగా సినిమా కలక్షన్ మరింత మెరుగుపడుతున్నాయి.రిలీజ్ డే కంటే రిలీజైన 3వ రోజు ఈ సినిమా ఎక్కువ కలక్షన్స్ ను సాధించడం విశేషం. సినీ విశ్లేషకుల అంచనాలు ప్రకారం ఈ హాలిడే సీజన్ లో మౌత్ టాక్ తో ఈ సినిమా మరింత విజయవంతగా ముందుకు సాగుతుందని తెలుస్తోంది. 
 
18 పేజెస్  ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల గ్రాస్ ను మరియు 22 కోట్ల నాన్-థియేట్రికల్ వసూళ్లను సాధించింది. ఈ సినిమాకి ఇప్పటికే డబుల్ ప్రాఫిట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథను అందించగా,  ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.గోపి సుందర్ సంగీతం అందించిన, ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు.