శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 13 జులై 2020 (22:21 IST)

25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న గుణశేఖర్ ఉత్తమ చిత్రం 'సొగసు చూడతరమా'

'రుద్రమదేవి'తో దర్శకనిర్మాతగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం 'హిరణ్యకశ్యప' ప్రారంభిస్తున్న డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శక నిర్మాతగా అందించిన 'సొగసు చూడతరమా' కి జులై 14 తో 25 సంవత్సరాలు పూర్తవుతుంది. నరేష్, ఇంద్రజ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అవడమే కాకుండా ప్రతిష్ఠాత్మకమైన మూడు నంది అవార్డులను సాధించింది.
 
బెస్ట్ ఫిల్మ్‌గా బంగారు నంది ని అందుకున్న ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్‌గా కూడా గుణశేఖర్ నంది అవార్డును అందుకున్నారు. బెస్ట్ కాస్ట్యూమ్స్ నంది అవార్డును కుమార్ తీసుకున్నారు. "'సొగసు చూడతరమా' చిన్న చిత్రంగా నిర్మించినా ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించడమే కాకుండా ఉత్తమ చిత్రం గా బంగారు నంది రావడం, స్క్రీన్ ప్లే రైటర్ గా నాకు నంది అవార్డు రావడం, కాస్ట్యూమ్స్‌కి కూడా నంది రావడం ఆ సినిమా దర్శకనిర్మాతగా ఎంతో ఆనందాన్ని కలిగించింది. 
 
ప్రేక్షకుల రివార్డ్స్ ను ప్రభుత్వ అవార్డ్స్ ను అందుకుని నా సినీ జీవితంలో అన్ని విధాలా సంతృప్తిని కలిగించి ఒక స్వీట్ మెమరీ గా నిలిచిన 'సొగసు చూడతరమా' 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు, అవార్డ్స్ ఇచ్చి గౌరవించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అన్నారు గుణశేఖర్.