'స్వాతిచినుకులు' నటుడు భరద్వాజ్‌కు కరోనా

Covid-19
Covid-19
ఠాగూర్| Last Updated: సోమవారం, 13 జులై 2020 (14:09 IST)
లాక్డౌన్ నిబంధనలు సడలింపుల కారణంగా సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. దీంతో టీవీ సీరియ‌ల్స్ శ‌ర‌వేగంగా షూటింగులు జరుగుతున్నాయి. క‌రోనా గైడ్‌లైన్స్ పాటిస్తూ అన్ని సీరియ‌ల్స్ సెట్స్ పైకి వెళ్ళాయి.

అయితే షూటింగ్ స‌మ‌యంలో కొంద‌రు స్టార్స్ క‌రోనా బారిన ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే నవ్య స్వామి, రవికృష్ణ, ఝాన్సీ, సాక్షి శివ, ప్రభాకర్ వంటి వారు క‌రోనా బారిన ప‌డ‌గా తాజాగా మ‌రో
బుల్లితెర నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల కరోనా బారిన పడ్డారు.

స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియ‌ల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న భ‌ర‌ద్వాజ్ క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. క‌రోనా ల‌క్ష‌ణాలు త‌న‌కి లేవ‌ని, మంచి డైట్‌తో పాటు మందులు వాడితే ఈ మ‌హ‌మ్మారిని నుండి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని తెలిపారు. పైగా తనతో కాంటాక్ట్ అయినవారు కూడా ఈ పరీక్షలు చేసుకోవాలని కోరారు.దీనిపై మరింత చదవండి :