శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జులై 2020 (10:42 IST)

మరణశయ్యపై ఉన్నాను.. ఇక బై - దివ్యా చౌక్సే... అంటూ పోస్ట్ చేసి లోకాన్నివీడిన మోడల్

బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో ఓ హృదయ విదాకర సంఘటన ఒకటి జరిగింది. అప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో చిట్‌చాట్ చేసిన ఓ మోడల్, నటి... తాను మరణశయ్యపై ఉన్నాను.. ఇకబై అంటూ పోస్ట్ చేసి... ఆ తర్వాత కొన్ని నిమిషాలకే కన్నుమూసింది. ఈమె దివ్యా చౌక్సే 'హై అప్పా దిల్ తోహ్ ఆవారా' చిత్రంతో పాటు పలు కంపెనీల వాణిజ్య ప్రకటనల్లో, టీవీ షోల్లో కనిపించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మోడలింగ్ రంగంలో ఓ వెలుగు వెలిగి, బాలీవుడ్ అవకాశాలను దక్కించుకున్న వారిలో దివ్యా చౌక్సే ఒకరు. కేన్సర్ వ్యాధి సోకి, సుదీర్ఘకాలం చికిత్స పొందుతూ వచ్చారు. 
 
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫ్యాన్స్ కోసం మరణానికి కొన్ని గంటల ముందు ఆమె పెట్టిన ఓ హృదయ విదారక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "క్యాన్సర్ వ్యాధి కారణంగా నేను నెలల తరబడి మరణ శయ్యపై ఉన్నాను. ఇక బై... దివ్యా చౌక్సే" అని పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆమె ఈ లోకాన్ని వీడారు. ఈ విషయాన్ని ఆమె సమీప బంధువు సౌమ్యా అమిశ్ ధ్రువీకరించారు. 
 
దివ్య సహనటుడు సాహిల్ ఆనంద్, తన సందేశాన్ని తెలుపుతూ, "నీ కలలు, అభిరుచులు, ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల మీ నిబద్ధత, సానుకూలత ఓ అన్నయ్యనైన నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. నీ జ్ఞాపకాలు నా గుండెల్లో సజీవం. నీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు.