శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (18:43 IST)

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Dinesh Mahindra
Dinesh Mahindra
తెలంగాణ దర్శకుడు ఎన్..శంకర్‌  శ్రీరాములయ్య,ఎన్‌కౌంటర్‌, జయం మనదేరా, భద్రాచలం, జై భోలో తెలంగాణ వంటి సంచలన విజయాలు సాధించిన చిత్రాలు మన కళ్ల ముందు మెదులుతాయి. అప్పట్లో ఈ చిత్రాలు ఎలాంటి ప్రేక్షకాదరణ పొందాయో అందరికి తెలిసిందే. తాజాగా  ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ తనయుడు దినేష్‌మహీంద్ర తండ్రి బాటలో దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవడానికి రెడీ అయ్యాడు. 
 
ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొంది, స్క్రీన్‌ప్లే విషయంలో పలు కోర్సులను పూర్తిచేశాడు దినేష్‌మహీంద్ర. త్వరలోనే దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో ఓ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ రూపుదిద్దుకోబోతుంది. నూతన తారలతో పాటు నూతన టెక్నిషియన్లను పరిచయం చేస్తూ యూత్‌ఫుల్‌ ఫీల్‌ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని “ఆరెక్స్ క్రియేషన్స్ “ సంస్థ నిర్మిస్తుంది..షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పాటల రికార్డింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.