బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (17:15 IST)

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

aamir
ఓటిటి సంస్థలు సినిమా విడుదలను శాసిస్తున్నాయంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాబోయే సినిమా "సితారే జమీన్ పర్" ఓటిటి హక్కులను సినిమా థియేరిటికల్ విడుదలకు ముందు అమ్మకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తొంది. దీనివల్ల తన సినిమాను ఎప్పుడు విడుదల చేసుకోవాలనే స్వేచ్ఛ తనకు ఉండటంతో పాటు.. థియేరిటికల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ను ఆడియన్స్‌కు అలవాటు చేసే అవకాశం‌ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
 
గతంలో ఏ సినిమా విడుదలైనా, దాని శాటిలైట్ హక్కులు ఎవరు కొన్నారు అనే అంశం అంత ప్రాచుర్యంలో ఉండేది కాదు. సినిమాను థియేటర్స్‌లోనే ఆడియన్స్ చూసెందుకు ఇంట్రెస్ట్ చూపేవారు. కానీ ఓటిటిలు వచ్చాక.. వాటి మార్కెటింగ్ కోసం సినిమాల విడుదలను కంట్రోల్ చేయటం మొదలుపెట్టాయి‌. ప్రతి సినిమా పోస్టర్‌లో ఓటిటి సంస్దల లోగో తప్పనిసరిగా ఉంటూ.. ఆడియన్స్‌‌ను ముందు నుంచి ప్రిపేర్ చెస్తూ ఉండటంతో ప్రేక్షకుల్లో క్రమంగా థియేటర్స్ సినిమాను చూసే ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. 
 
దీనికి అడ్డుకట్ట వేయాలంటే.. సినిమా విడుదల అయిన కొన్ని వారాల తర్వాతే ఓటిటిలతో డీలింగ్ చేసుకొవటం ఉత్తమంగా అమీర్ ఖాన్ భావించారట. తమ‌ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుంది అనే నమ్మకంతో ఉన్న అమీర్ ఖాన్ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు బాలీవుడ్ వర్గా సమాచారం.