శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (15:36 IST)

గోపిచంద్‌కు షూటింగ్‌లొ స్వల్ప గాయాలు..

గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తొన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ దగ్గర గల మాండవలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజుతో అక్కడ చిత్రీకరణ ముగించుకుంటోన్న నేపథ్యంలో హీరో గొపిచంద్‌పై బైక్ చేజింగ్ పోరాట సన్నవేశాలు చిత్రీకరణ చేస్తున్నారు.
 
ఈ సమయంలో బైక్ స్కిడ్ అవ్వటంతో స్వల్ప గాయాలయ్యాయి‌. గోపిచంద్ ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని, గాయాలకు ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం మిగిలిన చిత్రీకరణ చేసుకోవచ్చని అక్కడి ఫోర్టీస్ హాస్పిటల్స్ డాక్టర్స్ తెలిపారు.