గుండెపోటుతో నటుడు కజాన్ ఖాన్ మృతి
మలయాళ చిత్రాల్లో విలన్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కజాన్ ఖాన్ గుండెపోటుతో కన్నుమూశారు. ప్రొడక్షన్ కంట్రోలర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ NM బాదుషా కజాన్ ఖాన్ మృతిని ధ్రువీకరించారు.
ప్రముఖ విలన్ నటుడు కజాన్ ఖాన్ గుండెపోటుతో మృతి చెందినట్లు బాదుషా తెలిపారు. సిఐడి మూసా, వర్ణపకిట్టు వంటి పలు చిత్రాలలో నటించారు. కజాన్ ఖాన్ 1992 తమిళ చిత్రం సెంథమిళ్ పాట్టుతో వెండితెరకు పరిచయం అయ్యాడు.
అనేక తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు. ది కింగ్, వర్ణపకిట్టు, CID మూసా, ది డాన్, మాయామోహిని, రాజాధిరాజా, లైలా ఓ లైలా వంటి మలయాళ చిత్రాల ద్వారా గుర్తింపు సంపాదించుకున్నాడు.