శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (16:29 IST)

నటుడు నాజర్ ఇంట విషాదం.. తండ్రి కన్నుమూత

nazar father
ప్రముఖ నటుడు నాజర్ తండ్రి మాబూబ్ బాషా (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్దాప్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా తట్టాన్‌మలై వీధిలోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు. ఆయన మృతిపట్ల తమిళ చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలుపుతున్నారు. 
 
కాగా నాజర్ నటుడిగా రాణించడానికి నటనలో స్థిరపడిపోవడానికి ఆయన తండ్రే ప్రధాన కారణం. తండ్రి కోరిక మేరకు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన నాజర్.. ఆ తర్వాత దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నారు. నటనలో శిక్షణ పూర్తి చేసిన తర్వాత నాజర్‌కు సరైన అవకాశాలు రాకపోవడంతో చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో సప్లయర్‌గా చేరారు. ఆ తర్వాత తండ్రి కోరిక మేరకు ఆయన మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. మాబూబ్ బాషా అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి.