గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:34 IST)

ఎఫ్-క్లబ్ గుట్టువీడేనా : నేడు ఈడీ ముందుకు నవదీప్

తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ విచారణలో భాగంగా, సోమవారం నటుడు నవదీప్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. 
 
మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి నవదీప్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్‌తో లావాదేవీలపై ఈడీ ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ ఇప్పటికే ఏడుగురు సినీ ప్రముఖులను విచారించింది.
 
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈ నెల 8న హీరో దగ్గుబాటి రానాను ఈడీ విచారణకు హాజరయ్యాడు. నవదీప్ తో ఉన్న సంబందాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా విచారణ విచారించనున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా, ఇప్పటివరకు హీరో రవితేజ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ, రకుల్ ప్రీతి సింగ్ వంటి టాలీవుడ్ ప్రముఖులు ఈడీ విచారణకు హాజరైయ్యారు. ఎఫ్ కేఫ్ కేంద్రంగా సినీస్టార్స్‌కు డ్రగ్స్ సరఫరా అయినట్టు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు కెల్విన్.. సినీ తారలకు అక్కడే డ్రగ్స్‌ సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది.