సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2017 (15:58 IST)

తనకు పొగడ్తలే ఒక పెద్ద పండుగ : కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్. అందం... అభినయం కలగలిపిన హీరోయిన్. ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా కళ్యాణ్‌ రామ్‌తో కలిసి ఎమ్మెల్యే అనే సినిమాలో మాత్రమే నటిస్తోంది. దీంతో ఖాళీ సమయం ఎక్కువగానే ఉంది కాజల్‌కు

కాజల్ అగర్వాల్. అందం... అభినయం కలగలిపిన హీరోయిన్. ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా కళ్యాణ్‌ రామ్‌తో కలిసి ఎమ్మెల్యే అనే సినిమాలో మాత్రమే నటిస్తోంది. దీంతో ఖాళీ సమయం ఎక్కువగానే ఉంది కాజల్‌కు. పండగలు చేసుకోవడమంటే తనకు పెద్దగా ఇష్టముండదంటోంది కాజల్. తనకు ప్రతిరోజు పండుగేనని.. సినిమా రిలీజైనా.. సినిమాలో తాను బాగా నటించానని అభిమానులు కితాబిచ్చినా.. షూటింగ్ సమయంలో తనను ఎవరైనా పొగిడినా, సహచర నటీనటులందరూ తనను మెచ్చుకున్నా.. ఇందులో ఏది జరిగినా తనకు ప్రతిరోజు పండగంటోంది కాజల్.
 
కాబట్టి పండుగను జరుపుకోవాల్సిన అవసరం లేదు. నాకు పండుగలంటే పెద్ద ఆసక్తి లేదు గానీ, తనను పొగిడితేనే ఒక పెద్ద పండుగ అంటోంది కాజల్. పొగడ్తలతో పడిపోవడం నాకున్న వీక్నెస్. ఎంత మార్చుకుందామనుకున్నా సాధ్యం కావడం లేదు. బహుశా దేవుడు నాకు అలా రాసి ఉన్నట్లున్నాడు. నేను మారలేకపోవచ్చు అని కాజల్ చెబుతోంది. ఎవరైనా పొగిడితే చాలు కాజల్ పడిపోవడం ఖాయమంటున్నారు అభిమానులు.