సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (09:40 IST)

అంకుల్ మీరు నా పేరు వాడుకుని డబ్బులు సంపాదిస్తున్నారు : రేణూ దేశాయ్

renu desai
తన వ్యక్తిగత విషయాలను చర్చిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చిన ఓ జర్నలిస్టుకు సినీ నటి రేణూ దేశాయ్ గట్టిగా కౌంటరిచ్చారు. అంకుల్ మీరు నా నామస్మరణ చేసి వ్యూస్ సంపాదిస్తున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన గురించి మాట్లాడటం కంటే వ్యక్తిగత ప్రతిభతో రాణించాలని ఆయన కోరారు.
 
రేణూ దేశాయ్ చాలా కాలం తర్వాత హీరో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటించారు. రేణూ దేశాయ్ మళ్లీ తెరపైకి రావడంపై ఓ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో ఆమె వ్యక్తిగత విషయాలపైనా ఆయన కామెంట్స్ చేశారు. సదరు దృశ్యాలను రేణూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గతంలో తాను సాధించిన విజయాలను గుర్తుచేశారు. మహిళలను తక్కువగా చూడడం తగదన్నారు.
 
'అంకుల్ మీరు నా నామస్మరణ చేసి వ్యూస్ సంపాదిస్తున్నారు. నా పేరు వాడుకుని మీరు డబ్బులు సంపాదిస్తున్నందుకు నాకు ఆనందమే. కుర్చీలో కూర్చొని సినీ నటులపై గాసిప్స్ చెప్పడం కంటే మీ ప్రతిభతో సంపాదిస్తే ఇంకా బాగుంటుంది. ఏదైనా మంచి పని చేయండి. దైవ నామస్మరణ చేయండి. ఇంత వయసొచ్చిన తర్వాత కూడా మీ అనుభవం ఇలా ఉందంటే జాలేస్తోంది. 
 
నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవలేదు. నా గురించి మీకు తెలియదు. కానీ, నాపై ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. మన కల్చరులో స్త్రీలను దుర్గాదేవి, కాళీమాతగా భావిస్తారు. మగవారి పేరు, ప్రోత్సాహం లేకుండా మహిళలు ఏం చేయలేరని మీలాంటి వారు మాట్లాడుతుంటారు' అని రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన గురించి మాట్లాడినందుకే ఆ పోస్ట్ పెట్టలేదని, సమాజంలో మహిళలపై కొందరు మగవారికి ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పేందుకే పెట్టినట్లు ఆమె వివరించారు.